న్యాయవాద వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనదని, పేదలకు, అణగారిన వర్గాలకు సత్వర న్యాయం అందించడంలో ముస్లిం న్యాయవాదులు ఐక్యంగా కృషి చేయాలని సీనియర్ న్యాయవాది ఎం డి హాబిబుల్లా పిలుపునిచ్చారు. విశాఖపట్నం ముస్లిం అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెంలోని డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ షాదీఖానా లో ఉత్తరాంధ్ర ముస్లిం న్యాయవాదుల ఆత్మీయ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా సీనియర్ న్యాయవాదులు హాబి బుల్లా, రసూల్, రజాక్, జహన్నారా మాట్లాడుతు జూనియర్ న్యాయవాదులకు, సీనియర్ న్యాయవాదులు తగిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించాలని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీలకు పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు తమ అసోసియేషన్ ప్రత్యేక చొరవ చూపిస్తోందని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం వృత్తి పరమైన సమస్యల పరిష్కారానికి ముస్లిం న్యాయవాదులంతా, సమానవ్యయం తో పనిచేయాలిసిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంనకు ప్రత్యేక అతిధులుగ పాల్గొన్న 65 వ వార్డు కార్పొరేటర్ షేక్ జాహిరున్నిశ, 90 వ వార్డు కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, 65 వ వార్డు వై ఎస్ ఆర్ పార్టీ అధ్యక్షులు ఎం డి హబీబ్ మాట్లాడుతు ముస్లిం ల సమస్యల పరిష్కారం కోసం తమంతా కృషి చేస్తామని తెలిపారు. అన్ని రంగాల్లో ముస్లింలు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని చెప్పారు. అనంతరం అసోసియేషన్ నూతన కార్యవర్గన్ని సభ్యులు ఎన్నుకున్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షునిగా ఎండి హబీబుల్లా, అధ్యక్షులుగా ఎం.ఎ. రసూల్, ఉపాధ్యక్షులుగా షేక్ షరీఫ్, సయ్యద్ మొయినుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా జహాన్నార, కోశాదికారిగా ఎస్.కె హుస్సేన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా మహమ్మద్ సిరాజ్ మోహిద్దీన్, అష్రాఫ్ తదితరులు కార్యవర్గంగా ఎన్నికయ్యారు.కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్లుగ ఎన్నికైన జాహిరున్నిశ, రఫీ, హబీబ్ లను న్యాయవాదుల అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఆత్మీయ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు షరీఫ్, ఐ ఎం అహమ్మద్, ఆసరఫ్, సలీం,షేక్ మదీనా వలి, షాయబ్,ఇమ్రాన్,మోయునుద్దీన్,పెద్ద సంఖ్యలో పలువురు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
News
ఘనంగా ఉత్తరాంద్ర ముస్లిం న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం

Latest News

జి వి ఎం సి డిప్యూటీ మేయర్ యాదవులకే ఇవ్వాలి : అక్కరమాని వెంకట రావు
11/21/2026
డి ఎస్ సి, పోటీ పరీక్షల్లో విజయనికై ఆంగ్ల వ్యాకరణ పుస్తకం
11/21/2026
South Coast Railway Begins New Journey
11/8/2026
తాను విశాఖ షిఫ్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకుంట
11/16/2026



Comments (0)
Be the first to comment