Google Ad
Visaka News
Learn IPA
NewsVideosProfiles

Editor: Sanapala Jeevan Kumar

visakanews@gmail.com

8247829025

© 2026 VisakaNews. All rights reserved.
Google Ad
News

జి వి ఎం సి డిప్యూటీ మేయర్ యాదవులకే ఇవ్వాలి : అక్కరమాని వెంకట రావు

11/19/2026 (Updated 11/19/2026) • 👁 3 views • 🔗 0 shares

ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా కలిగి ఉండి అన్ని రంగాల్లో వెనుకబడ్డ యాదవ సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తెలుగుదేశం సీనియర్ నాయకుడు అక్కరమాని వెంకటరావు డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని మేఘాలయ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల నుంచి యాదవులు 21 మంది విజయం సాధించారని వారికి రానున్న రాజకీయ పదవుల నియామకంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ యాదవులకు డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఫ్లోర్ లీడర్ తదితర పదవులు ఇవ్వాలని ఆయన కోరారు. అలా చేస్తేనే తమకు న్యాయం చేసినట్ల వుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో తమ యాదవులు విశాఖ మేయర్లుగా, ఎమ్మెల్యేలుగా పలు కీలకమైన పదవులు నిర్వహించి సమర్ధవంతంగా పని చేశారన్నారు. దీనికి తాము ఆయా రాజకీయ పార్టీలకు కృతఙ్ఞతలు తెలుపుతున్నా మన్నారు

శ్రీ రాధా కృష్ణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తాం

ఈ నెల 24వ తేదీ మంగళవారం జరగనున్న కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ నగరంలోని గోకుల్ పార్క్, శ్రీ రంగ పురం బీచ్ రోడ్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ రాధా కృష్ణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తా మన్నారు. ఈ రాధా కృష్ణ మహోత్సవంలో ఆ రోజు ఉదయం 9 గంటల 21 నిముషాలకు శ్రీ రాధా కృష్ణుల కలశ ప్రతిష్ఠ మహోత్సవం జరపడంతో పాటుగా పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తా మన్నారు. తమ యాదవ సంఘం 294/79 రిజిస్టర్ నంబర్తో 1979వ సంవత్సరంలో రిజిస్టర్ కాబడిందని, అంతకు ముందు నుంచి తాము శ్రీ రాధాకృష్ణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నా మన్నారు. తమ సంఘం పేరును, రిజిస్టర్డ్ నెంబరును అనధికారికంగా వినియోగించడం కానీ, దుర్వినియోగం చేయడం కానీ చేయరాదన్నారు. తమ సంఘానికి అనుబంధంగా సుమారు 150 యాదవ సంఘాలు సమర్ధవంతంగా పని చేస్తున్నా యన్నారు. ఈ ఉత్సవాలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా జనసేన అధ్యక్షుడు దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యుడు సి హెచ్ వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ తదితర ప్రముఖులను ఆహ్వానిస్తున్నా మన్నారు. ఈ మీడియా సమావేశంలో యాదవ సంఘం నాయకులు నర్సింగ రావు, గుంటుబోయిన రవికుమార్, పల్లా మహేష్, ఒమ్మి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Why Should You Learn IPA?

Latest News

డి ఎస్ సి, పోటీ పరీక్షల్లో విజయనికై ఆంగ్ల వ్యాకరణ పుస్తకం

11/14/2026

South Coast Railway Begins New Journey

11/8/2026

తాను విశాఖ షిఫ్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకుంట

11/16/2026

జోష్ నింపిన సాంస్కృతిక వేడుక‌ ; అంబ‌రాన్నంటిని ఏయూ శ‌తాబ్ధి ఉత్స‌వ్

11/9/2026

సంప్రదాయని సుద్దిని సుద్దపూసని 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల

11/5/2026
More News

Leave a comment

Comments (0)

Be the first to comment