‘ఈ మధ్య కాలం లో పోటీ పరీక్షల్లో ఆంగ్లం లో చాలా మంది పాస్ అవలేక పోతున్నారని అయితే అందు లో పాస్ అవా లంటే మాతృ భాష లో కూడా పట్టు ఉండాలి’ అన్నారు ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆంగ్ల శాఖ అధిపతి సాలమాన్ బెన్ని. నిఘంటు కర్త సనపల జీవన్ కుమార్ రాసిన’ హేండ్ బుక్ ఆఫ్ ఇంగ్లిష్ ప్రోఫిషెన్సీ ‘ పుస్తకాన్ని తెలుగు శాఖ సమావేశ మందిరం లో జరిగిన కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొంటూ ఈ పుస్తకం లో ఆంగ్ల వ్యాకరణం ని తెలుగు నుడి కారం లో వివరించడం వలన తెలుగు మాధ్యమం విద్యార్థులకు బాగా ఉపయోగ పడుతుంది అని అన్నారు.
‘ఆంగ్ల వ్యాకరణ సూత్రాలను తెలుగు లోకి కేవలం అనువాదం చేయ కుండా తెలుగు వ్యాకరణమునకు సంబంధం కలుపుతూ, మన సంస్కృతి కి అన్వయిస్తూ పుస్తకం రాయడం గొప్ప విషయం’ అని తెలుగు శాఖ అధిపతి జర్ర అప్పారావు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ అన్నారు.
‘ప్రతి పుట లో ఉన్న విషయాన్ని తన స్వరం ద్వారా క్యూ ఆర్ కోడ్ రూపం లో ఇవ్వడం వలన విద్యార్థులు సుళువుగా విషయాన్ని గ్రహించ గలరని విశ్రాంత ఆచార్యులు యోహన్ బాబు అన్నారు.
‘భవిష్యత్ లో ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా ఆంగ్ల భాష లో సామర్ధ్య పరీక్ష తప్పని సరి అవుతుందని కాబట్టి అందరూ ఆంగ్ల వ్యాకరణం పై పట్టు సాధించాలని పుస్తక రచయిత జీవన్ కుమార్ అన్నారు.
జాతీయ జర్నలిస్టు నాయకుడు గంట్ల శ్రీను బాబు, సీనియర్ పాత్రికేయులు షేక్ ఇస్మాయిల్, ఏం ఏ తెలుగు ప్రధమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు, స్నాతకోత్తర విద్యార్థులు కార్యక్రమం లో పాల్గొన్నారు.









Comments (0)
Be the first to comment