Google Ad
Visaka News
Learn IPA
NewsVideosProfiles

Editor: Sanapala Jeevan Kumar

visakanews@gmail.com

8247829025

© 2026 VisakaNews. All rights reserved.
Google Ad
News

తాను విశాఖ షిఫ్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకుంట

3/22/2026 (Updated 6/21/2026) • 👁 21 views • 🔗 0 shares
one.jpg

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా, జీ స్టూడియోస్ సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘రాకాస’. యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు.

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖపట్నంలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది.

విశాఖపట్నం దశపల్ల హోటల్లో ఆదివారం ప్రెస్ మీట్ జరిగింది.

నిర్మాత నిహారిక కొణిదెల, మాట్లాడుతూ, ఈ చిత్రం ఏప్రిల్ 3 వ తేదీన విడుదల అవుతుంది అన్నారు. విశాఖపట్నం బీచ్ అంటే తనకు ఎంతో ఇష్టం అన్నారు. అందుకే తాను విశాఖ షిఫ్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకుంట అని చమత్కరించారు.

కమిటీ కుర్రాళ్ళు సక్సెస్ తర్వాత ఫెంటాసి కామెడీ తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాం అన్నారు. ఈ సినిమా బాగా వచ్చింది అని పేర్కొన్నారు. ఇందులో బ్రహ్మాజీ , తనికెళ్ళ భరణి వంటి సీనియర్ నటులు వున్నారు. ఈ చిత్రంలో మా కామెడీ నిజాయితీ గా ఉంటుంది అన్నారు. హీరో సంగీత్ తో తనకు ఇది రెండో సినిమా అని గుర్తు చేశారు.

హీరో సంగీత్ శోభన్, మాట్లాడుతూ, ఇది ఫెంటసి కామెడీ సినిమా అన్నారు. కొత్త జోనర్ కింద హారర్ జోనర్ లో సినిమా ఉంటుంది అన్నారు. దర్శకుడు విటలా చార్య తీసిన చిత్రల మాదిరిగా చందమామ కదల ఉంటుంది అన్నారు. ఫైనల్ గా ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ అన్నారు.

cover.jpg

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ, ఈ సినిమా ప్రమోషన్ వర్క్ విశాఖపట్నం లో ప్రారంభించిన ట్టు తెలిపారు. విశాఖ అంటే తనకు చాలా స్పెషల్ అన్నారు. ఇందులో మంచి కామెడీ ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ సినిమా తో పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.

నటుడు గెటప్ శ్రీను మాట్లాడుతూ, ఫెంటసి కామెడీ బాగా పండింది అన్నారు. హీరో సంగీత్ ఆధరగొట్టారు అన్నారు. ఇందులో నటులు అందరూ కస్టపడి చేశారు అని పేర్కొన్నారు.

Why Should You Learn IPA?

Latest News

South Coast Railway Begins New Journey

6/15/2026

జోష్ నింపిన సాంస్కృతిక వేడుక‌ ; అంబ‌రాన్నంటిని ఏయూ శ‌తాబ్ధి ఉత్స‌వ్

7/1/2026

సంప్రదాయని సుద్దిని సుద్దపూసని 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల

6/27/2026

విశాఖలో 2 రోజుల పాటు టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ పండుగ

6/14/2026

మహిళ హత్య మరియు భారీ దోపిడీ కేసు

2/27/2026
More News

Leave a comment

Comments (0)

Be the first to comment