Google Ad
Visaka News
Learn IPA
NewsVideosProfiles

Editor: Sanapala Jeevan Kumar

visakanews@gmail.com

8247829025

© 2026 VisakaNews. All rights reserved.
Google Ad
Trending

మహిళ హత్య మరియు భారీ దోపిడీ కేసు

By Sanapala Jeevan Kumar • 2/23/2026 • 👁 12 views • 🔗 2 shares

నగరంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక మహిళ హత్య మరియు భారీ దోపిడీ కేసును విశాఖ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి భారీగా బంగారు ఆభరణాలు, నగదు మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

​గత ఫిబ్రవరి 11, 2026న ఆరిలోవ, దుర్గా నగర్ నివాసి అయిన కాపు వెంకట రమణ తన భార్య కాపు లక్ష్మి (54) ఇంట్లో రక్తపు మడుగులో మరణించి ఉండటాన్ని గమనించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మరియు ఇంట్లోని నగదును దోచుకెళ్లినట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆరిలోవ పోలీసులు క్రైమ్ నంబర్ 46/2026, U/s 103(1), 305(a) BNS కింద కేసు నమోదు చేశారు.

​నిందితుడి వివరాలు:

​అరెస్ట్ అయిన నిందితుడి పేరు వంజరాపు శివ గంగరాజు @ టాటా శివ (34 ఏళ్లు). ఇతను విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, కొనేరు గట్టు గ్రామానికి చెందినవాడు.

​పోలీసుల దర్యాప్తు:

​సిపి గారి ఆదేశాల మేరకు, డిసిపి (క్రైమ్స్) కుమారి కె. లత మాధురి ఐపిఎస్, ఏసిపి ద్వారక సబ్ డివిజన్ మరియు ఆరిలోవ సిఐ బి. భద్రరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. CCTV ఫుటేజ్, టవర్ డంప్ మరియు CDR అనాలిసిస్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించారు. నిందితుడు నేరం చేసిన తర్వాత ధన్‌బాద్, కాశీ, ఢిల్లీ వంటి ప్రాంతాలకు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు, ఫిబ్రవరి 22, 2026 రాత్రి విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు.

​రికవరీ చేసిన సొత్తు:

​నిందితుడి వద్ద నుండి సుమారు రూ. 5,05,000/- నగదు ఈ క్రింది వస్తువులను పోలీసులు

రికవరీ చేశారు:

​ఒక బంగారు గొలుసు (సుమారు 16.10 గ్రాములు)

​బంగారు లక్ష్మీదేవి రూపులు

​నల్ల పూసల దండ

​బంగారు గాజులు మరియు ఉంగరాలు

​నగదు

Advertisement

Latest News

మహిళ హత్య మరియు భారీ దోపిడీ కేసు

2/23/2026

తన పాత్ర కోసం గోదావరి స్లాంగ్ ప్రాక్టీస్ చేశా ; హీరోయిన్ ​సంధ్యా వశిష్ట

2/23/2026
More News

Leave a comment

Comments (0)

Be the first to comment