ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సాయంత్రం 07:30 నుండి రాత్రి 11:00 గంటల మధ్య , నగర జోన్ -01 పరిధిలో 81 మంది సిబ్బందితో, 27 టీంలుగా, 50 హోటల్/లాడ్జిలలో ఈ తనిఖీలు చేపట్టడం జరిగినది. ఈ దాడులలో ప్రతీ టీమ్ బాడీ వార్న్ లేదా మొబైల్ కెమెరాలను వినియోగిస్తూ, హోటల్/లాడ్జిల గదులు తనిఖీ చేస్తునప్పుడు ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్/హోం గార్డ్ కూడా ఉండి తనిఖీలను క్షుణ్ణంగా చేయడం జరిగినది.
ఈ తనిఖీలలో గుర్తించిన అంశాలు:
🔳 13 హోటల్లు & లాడ్జీలు అగ్నిమాపక NOCని కలిగి లేవు,
🔳 09 హోటళ్లు & లాడ్జీలకు ట్రేడ్ లైసెన్స్ లేవు,
🔳 13 హోటళ్లు & లాడ్జీలకు FSSAI లైసెన్సు లేవు,
🔳 10 హోటల్లు & లాడ్జీలు GST సర్టిఫికేట్ కలిగి లేవు,
🔳 06 హోటల్లు VMSలో సందర్శకుల సమాచారాన్ని సరిగ్గా అప్డేట్ చేయడం లేదు.
ఈ సందర్భముగా సిపి గారు మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో గల అన్ని హోటల్/లాడ్జిలలో చట్ట పరముగా ఉన్న అన్ని నిబంధనలను ఖచ్చితముగా పాటించాలని కోరారు, ఇకపై కూడా హోటల్/లాడ్జిల పై ఈ డైనమిక్ దాడులు కొనసాగుతాయి అనీ, నిబంధనలను పాటించని హోటల్/లాడ్జిల యాజమానులపై కూడా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని , యెటువంటి ఫిర్యాదులుకైనా తాను ఇచ్చిన 7995095799 నంబరుకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తెలియపరచగలరని విజ్ఞప్తి చేయడం జరిగినది.