|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
విశాఖ జిల్లాకు మొదటి సారిగా పి.టి.జి. తెగకు చెందిన గిరిజన మహిళ జల్లిపల్లి సుభద్ర కు జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి
|
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనకు విశాఖపట్నం జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా జల్లిపల్లి సుభద్ర తో పాటుగా ఉపాధ్యక్షులు, టి.అప్పారావు, బి.వి.సత్యవతి, కోఆప్షన్ సభ్యులుగా పి.ఎస్.ఎస్.జోసెఫ్, వి.వి.సత్యనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో తమ పార్టీకి 37 జెడ్పీటీసీలను అందించిన జిల్లా ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసు కుంటున్నానన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రజల మేలుకోరి వివిధ సంక్షేమం, అభివృద్ది పథకాలను అమలు చేస్తున్నారన్నారు. విశాఖ జిల్లాలో మూడు విభిన్న ప్రాంతాలు సిటి ఆఫ్ డెస్టినీ, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయన్నారు. మొదటి సారిగా పి.టి.జి. తెగకు చెందిన గిరిజన మహిళకు జెడ్.పి.పి. అధ్యక్షురాలిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి జిల్లాప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు చెప్పారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లలో భాగంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. నూతనంగా ఎన్నికైన జెడ్.పి.టి.సిలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి జిల్లా అభివృద్దికి కృషి చేయాలని, అన్ని రంగాలలో జిల్లాను అగ్రపథంలో నడిపించాలన్నారు.
ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజా రంజకపాలనకు నిదర్శనంగా రాష్ట్రంలొ ముత్తం 13 జిల్లా పరిషత్ లు తమపార్టీ ఖాతాలోనే చేరాయన్నారు. మెజార్టీని బాధ్యతగా భావించి మరింత కృషి చేయాలన్నారు. గెలిచిన చైర్ పర్సన్, సభ్యులు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలందరికీ చేరేలా పని చేయాలన్నారు. జెడ్ పి చైర్ పర్సన్ గా ఎన్నికైన సుభద్ర మాట్లాడుతూ తనకు అత్యున్నత పదవినిచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని పేదలందరికీ పథకాలు అందేందుకు కృషి చేస్తానని చెప్పారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానన్నారు.
ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యురాలు జి.మాధవి, శాసన సభ్యులు యు.వి.సూర్యనారాయణరాజు, జి.అమర్ నాధ్, కరణం ధర్మశ్రీ, కె.భాగ్యలక్ష్మి, శెట్టి ఫల్గుణ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అదీప్ రాజ్, గొల్లబాబూరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
Saturday, September 25, 2021 9/25/2021 2:37:39 PM
|
Keywords |
ZP Chair Person, Jallipalli Subadhra, Muttamshetti Srinivas,
|
|
|
|
|
|
|
|
|
TODAY LATEST NEWS UPDATED
|
|
|
|
|
|
|
|
The Best Vizag News Portal in Vizag and Visakhapatnam,
Vizag News, Hospitals in Vizag, Schools in Vizag, Vizag Photos, Latest Vizag
News with Photos, Visakhpatnam Latest News Updates, Vizag Shopping, offers in
Vizag, services in vizag, Fashion in Vizag, News in Vizag, Shopping in vizag,
Realestate in Vizag, Education in vizag, School in Vizag, Colleges in Vizag,
Ticket Booking in Vizag, Tourism in Vizag, Jobs in vizag, Job Consultancies in
Vizag, Vizag videos, Vizag photos, vizag Publicity portal , Vizag online
portals, vizag new portals, visakhapatnam online shopping portsl, Kailash
Giri, Rushikonda beach, RK beach, Railway Station, Lodges in vizag, Transport
services in vizag, Travels in vizag, Restaurants in Vizag, Universities in
vizag, Engineering Colleges in vizag, Hospitals in vizag, Medical Services
in vizag, Medical Equipments, Doctors in vizag, Youth entertainmnet in vizag,
Cinema theatres in Vizag, Electronics Stores in vizag, Mechanical Services
in vizag, House Hold equipments services in vizag, Companies in vizag, Software
companies in vizag, Industrial Services in vizag.
|