|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
స్మార్ట్ సిటీ పథకంలో ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ కొరకు 1,600 ఎకరాలు ప్రాంతం గుర్తింపు
|
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా మేనేజ్మెంట్ యూనిట్ టీం ఆఫ్ ఎన్.ఐ.యు.ఎ. డైరెక్టర్ హితేష్ విద్యాకు ప్రాజెక్టు వివరాలు స్మార్ట్ సిటీ సి.ఇ.ఒ./జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన తెలియజేశారు. శుక్రవారం ఆమె ఎన్.ఐ.యు.ఎ. డైరెక్టర్ కు భారత ప్రభుత్వంచే గుర్తింపబడిన 100 ఆకర్షణీయ నగరాల్లో, మొదటి 20 నగరాల్లో విశాఖపట్నం 8వ స్థానం పొందిందని, స్మార్ట్ సిటీ పథకంలో ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ కొరకు 1,600 ఎకరాలు ప్రాంతం గుర్తించడమైనది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు మొత్తం 59 పనులుగానూ అంచనా విలువ రూ.1000 కోట్లతో రూపొందించడం జరిగినదని తెలిపారు. అందులో లో 44 ప్రాజెక్టులు అనగా, సిటీ ఆపరేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయుట, సోలార్ పవర్ ప్లాంట్ లు, పాఠశాలల యందు స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఏబిడి ఏరియాలో పార్కులు, పాఠశాలలు ఆధునీకరణ, వీధి కాలువలు, గెడ్డలు ఆధునీకరణ, వుడా పార్క్ ఆధునీకరణ, 50 జంక్షన్లో ఎడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయుట, సిటిజెన్ సౌకర్యం సెంటర్లు ఏర్పాటు చేయుట మొదలగు పనులు రూ.371.06 కోట్లుతో పూర్తి చేయడం జరిగినదని తెలిపారు. 14 ప్రాజెక్టులు అనగా, దండు బజార్ స్కూలు ఆధునీకరణ, స్పోర్ట్స్ ఎరీనా, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, 24/7 నీటి సరఫరా, ఏబిడి ఏరియాలో ఆకర్షణీయ రహదారులు, సోలార్ వీధి దీపములు ఏర్పాటు చేయుట, ఓటు గడ్డ ఏర్పాటు చేయుట, టౌన్ హాల్ మరియు పాత మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ సంరక్షించుటకు సంబంధించిన పనులు, వెండింగ్ కియోస్కులు, ఎ బి డి ఏరియా యందు మిగిలిన వీధులు ఆకర్షణీయం చేయుట, పనులు రూ.344.63 కోట్లతో పురోగతిలో ఉన్నవని తెలిపారు. సిటీస్ ప్రాజెక్టు కింద జివిఎంసి స్కూల్స్ ని ఆధునీకరించడం అనగా సౌకర్యాలను మెరుగుపరచడం మరియు చదువుకునే వాతావరణం పెంపొందించుటకు పనులు నిమిత్తమై రూ. 65 కోట్లతో ఆమోదం చేయడమైనదని కమిషనర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిగా పూర్తిచేయిస్తూ ప్రాజెక్టులో జరిగిన, జరగబోయే పనులను వివరణాత్మకంగా ప్రదర్శినందుకు ఎన్.ఐ.యు.ఎ. డైరెక్టర్ హితేష్ విద్యా మరియు కమిటీ సభ్యులు స్మార్ట్ సిటీ సి.ఇ.ఒ. / జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజనను అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, పర్యవేక్షక ఇంజినీరు వినయ్ కుమార్, కార్యనిర్వాహక ఇంజినీరు సుధాకర్, ఎన్.ఐ.యు.ఎ. టీం లీడర్ నైమ్ కురువేల, ప్రోగ్రాం ఆఫీసర్ మన్సీ సింగ్, ఇ.&ఎస్. స్పెషలిస్ట్ ప్రొఫసర్ డాక్టర్ శిల్పి గుప్తా, గ్లోబల్ మెంటర్ ప్రొఫెసర్ ప్రసన్న దేశాయ్, డొమెస్టిక్ ఎక్స్పెర్ట్ స్వాతి జాను, స్కూలు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
|
|
Friday, September 24, 2021 9/24/2021 2:44:13 PM
|
Keywords |
GVMC, Smart City Project, Power Point Presentation, Area Based Development,
|
|
|
|
|
|
|
|
|
TODAY LATEST NEWS UPDATED
|
|
|
|
|
|
|
|
The Best Vizag News Portal in Vizag and Visakhapatnam,
Vizag News, Hospitals in Vizag, Schools in Vizag, Vizag Photos, Latest Vizag
News with Photos, Visakhpatnam Latest News Updates, Vizag Shopping, offers in
Vizag, services in vizag, Fashion in Vizag, News in Vizag, Shopping in vizag,
Realestate in Vizag, Education in vizag, School in Vizag, Colleges in Vizag,
Ticket Booking in Vizag, Tourism in Vizag, Jobs in vizag, Job Consultancies in
Vizag, Vizag videos, Vizag photos, vizag Publicity portal , Vizag online
portals, vizag new portals, visakhapatnam online shopping portsl, Kailash
Giri, Rushikonda beach, RK beach, Railway Station, Lodges in vizag, Transport
services in vizag, Travels in vizag, Restaurants in Vizag, Universities in
vizag, Engineering Colleges in vizag, Hospitals in vizag, Medical Services
in vizag, Medical Equipments, Doctors in vizag, Youth entertainmnet in vizag,
Cinema theatres in Vizag, Electronics Stores in vizag, Mechanical Services
in vizag, House Hold equipments services in vizag, Companies in vizag, Software
companies in vizag, Industrial Services in vizag.
|